4, జులై 2018, బుధవారం

subscribe

తెలుగు వారి కోసం



బాబ్రి మసీదును 500 ఏళ్ల కిందట అంటే 1528లో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ పేరు మీద మీర్‌ బాఖీ నిర్మించారు.

1853 : మసీదుకు సంబంధించి మొట్టమొదటి హింస జరిగిన సంవత్సరం. నిర్మోహి అఖారాకు చెందిన హిందువులు, అలాగే అవధ్‌ నవాబ్‌ అయిన వాజిద్‌ ఆలీ షా వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు ఆధారాలున్నాయి. రామాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువులు తొలిసారి ఆరోపించారు.

1885 : బాబ్రీ మసీదుపై మొదటిసారిగా మహంత్‌ రఘుబర్‌దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. మసీదు స్థలం రామాలయయని ఆయన కోర్టుకు తెలిపారు.

1889 : హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగడంతో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం మసీదు చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ముస్లింలకు లోపలి భాగం, హిందువులకు బయటి భాగాన్నిఅప్పగించింది.

1949 : బాబ్రీ మసీదులోకి ప్రవేశించిన కొందరు హిందువులు.. అక్కడ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టించారు.

1950 : బాబ్రీ మసీదులోని ఖాళీ ప్రాంతంలో ప్రార్థనలను చేసుకునేందుకు అనుమతించాలంటూ.. మహంత్‌ పరమహంస రామచంద్ర దాస్‌ ఫైజాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. ఖాళీ భాగంలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించన కోర్టు.. లోపలి భాగంలోకి వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించింది.

1959 : మొత్తం స్థలాన్ని తమకు అప్పగించాలంటూ నిర్మోహి అఖారా మూడోసాకి కోర్టును అశ్రయించింది.

1961 : మసీదు ఖాళీప్రాంతాన్ని స్మశానంగా మార్చుకునేందుకు అనుమతి కోరుతూ.. సున్నీ సెంట్రల్‌ బోర్డు, షియా వక్ఫ్‌ బోర్డులు కోర్టుకెక్కాయి.

1984 : రామజన్మ భూమిలో రామాలయాన్నినిర్మించడమే లక్ష్యమంటూ బీజేపీ అగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీ ప్రకటన. రామాలయం నిర్మాణం కోసం ఉద్యమం మొదలు పెట్టిన అద్వానీ.

1986 : బాబ్రీ మసీదులో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చంటూ జి‍ల్లా కోర్టు తీర్పు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు.. బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు.

1989 : విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో మసీదులోని ఖాళీ స్థలంలో రామాలయం నిర్మాణానికి శిలాన్యాస్‌. అంతేకాక మసీదును మరో ప్రాంతానికి తరలించాలంటూ.. కోర్టులో కేసును దాఖలు చేసిన వీహెచ్‌పీ

1990 : చంద్రశేఖర్‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కొందరు కర సేవకులు బాబ్రీ మసీదును పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సమయంలో ప్రధాని చంద్రశేఖర్‌.. ఇరు వర్గాల మధ్య చర్చలతో సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నాలు చేశారు. చర్చలు జరుగుతున్న సమయంలోనే బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ రామాలయం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర మొదలు పెట్టారు.

1991 : అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అద్వానీ రథయాత్రతో మొదటిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. దీంతో అయోధ్యలో కరసేవకుల ఉద్యమం మరింత ఉధృతమైంది.

1992 : డిసెంబర్‌ 6న శివసేన, వీహెచ్‌పీ, బీజేపీ కార్యకర్తలు భారీగా వివాదాస్పద ప్రాంతానికి చేరుకుని.. మసీదును కూల్చారు. ఈ సమయంలో జరిగిన అల్లర్లలో 2 వేలమందిపైగా మరణించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు జస్టిస్‌ లిబర్హాన్‌ కమిషన్‌ను నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసిం‍ది.

2002 : గుజరాత్‌ నుంచి అయోధ్యకు రైలుతో తరలివెళుతున్న కరసేవకులపై గోధ్రా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడి. 58 మంది కరసేవకుల మృతి. గోధ్రా ఘటన తరువాత చెలరేగిన అల్లర్లలో సుమారు 1000 మంది మరణించారు.

2002 : బాబ్రీ మసీదు ప్రాంతంపై సర్వే చేయాలంటూ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించిన హైకోర్టు.

2003: బాబ్రీ మసీదు ప్రాంతంలో సర్వే పనులు మొదలు పెట్టిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌. మసీదు కింది భాగంలో ఆలయం ఉన్నట్లు తేల్చిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌.

2009 : బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి ఏర్పాటు చేసిన లిబర్హాన్‌ కమిషన్‌ నివేదిక కేంద్రానికి సమర్పించింది. ఇందులో బీజేపీ అగ్రనేత అద్వానీ సహా మరో 68 మందిని దోషులుగా తేల్చింది.

2010 : బాబ్రీ మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు మొదటిసారి తీర్పును వెలవరించింది. మొత్తం వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించి.. నిర్మోహి అఖారాకు, రామజన్మభూమికి, మసీదుకు కేటాయిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును ఇరు వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.

2011 : అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం‍కోర్టు స్టే. యథాతథ స్థితిని కొనసాగించాలన్న సుప్రీం.

2014 : నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల్లో ఘనవిజయం.

2015 : అయోధ్యలో రామమందిర నిర్మాణం లక్ష్యంగా వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా రాళ్ల సేకరణ. సరిగ్గా రెండు నెలల తరువాత రెండు ట్రక్కుల రాళ్లు వివాదాస్పద ప్రాంతానికి చేరుకున్నాయి. మోదీ ప్రభుత్వం అనుమతిస్తే రామాలయాన్ని నిర్మిస్తామంటూ.. మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ ప్రకటన.

2017 : అమోధ్య ధ్వంసానికి సంబంధించి అద్వానీపై తిరిగి కేసును రీ ఓపెన్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు.

2017 : ఉత్తర్‌ప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ

2017 మార్చి 21 : బాబ్రీ మసీదు విషయం చాలా సున్నితమైనది. దీనిని కోర్టు బయటే తేల్చుకోవాలన్న సుప్రీంకోర్టు.

2017 డిసెంబర్‌ 5 : అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన వర్గాల వాదనలు వినేందుకు సిద్ధపడ్డ సుప్రీం కోర్టు. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో బాబ్రీ మసీదు విచారణను.. వచ్చే ఏడాది ఫిబ్రవరి8కి వాయిదా వేసిన కోర్టు.



సోర్స్:- వాట్సప్ లో వచ్చిన విషయం ​




మీరు పంపిన విషయాలను కూడా మీ పేరు తో ప్రచురిస్తాం
మా వాట్సప్ నెంబర్ 9550547298


SUBSCRIBE FOLLOW SHARE LIKE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి